శర్వా తో అవసరాల..?

నటుడి గా ప్రేక్షకులను అలరించిన అవసరాల శ్రీనివాస్..ఆ తర్వాత డైరెక్టర్ గా మారి క్లాసికల్ హిట్స్ తో మంచి మార్కులు కొట్టేసాడు. ప్రస్తుతం ఈయన తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు , హీరోలు సిద్ధం గా ఉన్న సరైన కథను సిద్ధం చేయడం లో అవసరాల వెనుక పడుతున్నాడు. సాయి కొర్రపాటి , సితార బ్యానర్ లలో సినిమాలు చేయాల్సిన అవసరాల..తాజాగా వైజయంతి బ్యానర్ లో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడట.

ఇటీవలే పడి పడి లేచే మనసు తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో శర్వానంద్ కు అవసరాల ఓ కథ చెప్పాలని చూస్తున్నాడట. ప్రస్తుతం శర్వా ఖాతాలో రెండు సినిమాలు ఉన్నాయి. సుధీర్ వర్మ డైరెక్షన్లో ఒకటి , దిల్ రాజు నిర్మించబోయే 96 రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత అవసరాల సినిమా చేయాల్సి ఉంటుంది. మారి ఆ రెండు సినిమాలు పూర్తి అయేవరకు అవసరాల వెయిట్ చేస్తాడో లేక వేరే హీరో తో చేస్తాడో చూడాలి.