ఆ హీరోకి డ్రగ్స్ అలవాటు


హలీవుడ్ నటుడు జానీ డిప్ పై ఆయన మాజీ భార్య అంబర్ హర్డ్ సంచలన ఆరోపణలు చేసింది. జానీ మద్యం, డ్రగ్స్ బానిస. హింసాత్మక ధోరణితో ప్రవర్తించే వాడు. మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకొన్న తర్వాత ఏం చేసేవాడో గుర్తుండేది కాదు. దారుణంగా శారీరకంగా, మానసికంగా దాడి చేసే వాడు. ఆయనను ప్రేమించాను కాబట్టి అతడి వేధింపులను భరించాను అని హంబర్డ్ హార్డ్ తెలిపింది. జానీ డిప్‌తో ఏడాదిపాటు రిలేషన్‌షిప్ సాగింది.

తాజాగా, తనను మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం, పరువు నష్టం చెల్లించాలని కోర్టులో అంబర్ హర్డ్ దావా వేసింది. నాకు జరిగిన మానసిక, పరువు నష్టానికి రూ. 340 కోట్లు (50 మిలియన్ల డాలర్లు) చెల్లించాలని కోర్టును కోరింది. జానీ డిప్, హంబర్ 2015లో పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత 2017లో వారిద్దరూ విడిపోయారు.