ఆ హీరో.. సాయిపల్లవి చెంప చెల్లుమనిపించాడు !

‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది హీరోయిన్ సాయిపల్లవి. ఈ క్రేజ్ తో కోలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకొంటోంది. ఐతే, సాయి పల్లవి ప్రవర్తనపై ఇప్పటికే బ్యాడ్ టాక్ బయటికొచ్చింది. ఆమె షూటింగ్ స్పాట్ లో చుక్కులు చూపిస్తుందట. టైంకు రాదట. అనవసరమైన పట్టింపులు ఉంటాయట. కోలీవుడ్ స్టార్ సూర్యని కూడా సాయి పల్లవి టార్చర్ చేసినట్టు లీకులొచ్చాయ్.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. నాగ‌శౌర్య-సాయిపల్లవి జంటగా ‘కణం’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో సాయి పల్లవి చెంప చెల్లుమణిపించాడట నాగ‌శౌర్య. అన‌వ‌స‌ర విష‌యాల్లో ఎమోష‌న‌ల్ అయిన సాయిప‌ల్ల‌విని అదుపులోకి తెచ్చేందుకు అలా కొట్టాల్సొచ్చింద‌ని తెలుస్తోంది. ఇప్పుడీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐతే, ఈ వ్యవహారంలో చాలామంది నాగ‌శౌర్యను సపోర్ట్ చేస్తుండటం విశేషం.