ఫారిన్ కుర్రాడితో శ్రియా పెళ్లి ?

హీరోయిన్ శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. సౌత్ లోను.. అటు నార్త్ లోను కూడా క్రేజ్ ఉన్న బ్యూటీ శ్రియా.

గత పదిహేనేళ్ళుగా ఇండస్ట్రీలో వున్న శ్రీయా త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని తాజా సమాచారం. మార్చి నెలలో శ్రియ వివాహం జరగబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రష్యన్ యువకుడితో శ్రియ చాలా సన్నిహితంగా ఉంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందట. పెళ్లి విషయాన్ని అబ్బాయి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యాకు వెళ్లిందట. రాజస్థాన్ లో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అయితే, ఈ వార్తలపై శ్రియ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.