పవన్ హీరోయిన్ పెళ్లి జపం.. !

shruthi
పవన్ – శృతిహాసన్ లది హిట్ పెయిర్. గతంలో ‘గబ్బర్ సింగ్’ కోసం జతకట్టారు. గబ్బర్ సింగ్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ‘కాటమరాయుడు’ కోసం మరోసారి ఈ జంట జతకట్టబోతున్నారు. ఇందులో ఈ జంట రొమాన్స్ తో రెచ్చిపోనుందట. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఉగాధి కానుకగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే, కొన్నాళ్లుగా శృతిహాసన్ మనసు పెళ్లిపై పడినట్టు కనబడుతోంది. ఈ మేరకు ఆమె సంకేతాలు ఇస్తుంది. తాజాగా, పెళ్లి తర్వాత కూడా నటిస్తానంటూ ఓ కామెంట్ వదిలింది శృతి. ఇప్పుడు శృతి కామెంట్ పై ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చ జరుగుతోంది. తండ్రి కమల్ హాసన్ మాదిరిగా పెళ్లిపై పెద్దగా నమ్మకాలు లేని శృతి.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా.. ? ఈ క్రమంలోనే ఎవరు అడగకపోయినా పెళ్లి ప్రస్తావన తెస్తుందా.. ?? అనే కామెంట్స్ వినబడుతున్నాయి.

అడిగితేనే పెళ్లి గురించి దాటవేసే హీరోయిన్లని చూస్తుంటాం. ఇప్పుడు శృతి అడగకపోయినా పనిగట్టుకొని పెళ్లి కబర్లు చెబుతోంది. ఇదే పెళ్లి జపం కాక ఇంకేమంటారు. పెళ్లి తర్వాత.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటిస్తానంటోంది శృతి. ఆమె మాటలని బట్టి చూస్తే.. శృతిని హీరోయిన్ గానే కాదు.. అక్క, ఆంటీ, అత్తమ్మ, అమ్మమ్మగా.. కూడా చూడొచ్చేమో !