ముందు డబ్బులిస్తే.. వస్తుందట !


హీరోయిన్స్ అంటేనే కమర్షియల్ గా ఉంటారని చెబుతుంటారు. ‘దీపం ఉండగానే ఇల్లు సర్థుకోవాలి’ అనే టైపు అన్నమాట. హీరోయిన్ శృతిహాసన్ ఇంకా పక్కగా ఉంటుందట. ముందు అడ్వాన్స్ చేతిలో పెడితేనే షూటింగ్ కి వస్తానని కరాఖండిగా చెప్పేస్తుందట శృతి. ప్రస్తుతం శృతి చేతిలో సినిమాలేవీ లేవు. తెలుగునైతే.. ఒక్క సినిమా కూడా లేదు. ఇలాంటి సమయంలో ఆమె ఓ మరాఠి సినిమాకి సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమా కోసం శృతి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా.. ఆమెని నిర్మాతలు తీసుకొన్నారు. తీరా షూట్ మొదలుపెట్టే సమయానికి ముందుగా ఇస్తామన్న అడ్వాన్స్ డబ్బు ఇస్తేనే షూటింగ్లో అడుగుపెడతానని శృతి పట్టుబట్టి కూర్చుందట. అసలే చేతిలో సినిమాలేవీ లేవు. ఇలాంటి సమయంలో శృతి ఇంత డబ్బుల దగ్గర ఇంత గట్టిగా ఉండటమేంటో ? అనుకుంటున్నారంత. బహుశా.. డబ్బుల కోసమే ఈ సినిమా ఒప్పుకొని ఉందేమో శృతి.