శివ బాలాజీ మాట తప్పాడు

siva-balaji

యంగ్ టైగర్ ఎన్టీఆర్’గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు షో సీజన్ – 1 విజేతగా నటుడు శివ బాలజీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఓ విషయంలో శివ బాలాజీ మాటతప్పినట్టు చెప్పుకొంటున్నారు. ప్రైజ్ మనీ ఏం చేయబోతున్నారు ? అన్న ప్రశ్నకి.. ఆ విషయాన్ని వేదికపై చెబుతానని తెలిపారు. తీరా వేదికపై ప్రైజ్ మనీ ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు.

అయితే, బిగ్ బాస్ షో ద్వారా గెలుచుకొన్న రూ. 50లక్షలు. పన్ను మినహాయించగా రూ. 35లక్షల డబ్బుని శివ బాలాజీ అనాథ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. శివ బాలాజీ చేసిన మంచి పనిని తప్పక అభినందించాల్సిందే. బిగ్ బాస్ తర్వాత శివ బాలాజీకి ఆఫర్లు కూడా అధికమయాయట. ఈ విషయాన్ని త్వరలోనే శివ బాలాజీ వెల్లడించబోతున్నట్టు సమాచారమ్. ఆ సమయంలోనే ప్రైజ్ మనీని ఎలా ఖర్చుపెట్టిన విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది.