రామ్ చరణ్ ఐటమ్ గా సోనాక్షి సిన్హా ?

sonakshi

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్చమైన ప్రేమకథా చిత్రమిది. చరణ్ సరసన సమంత జతకట్టనుంది. దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో అదిరిపోయే ఐటమ్ సాంగ్స్ ని ప్లాన్ చేస్తుంటాడు. ‘రంగస్థలం’ కోసం ఓ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారట. పైగా ఈ కథ 1985 నేపథ్యంలో సాగేది. దీంతో అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా ఓ హాటు హాట్ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారట.

ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని తీసుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. రంగస్థలంలో రచ్చ రచ్చ జరిగినట్టే. మరోవైపు, ఐటమ్ సాంగ్ కోసం సోనాక్షి ఓకే చెప్పి ఉండదు. అంతగా కావాలంటే రంగస్థలంలో కీలక పాత్ర పోషిస్తున్న హాట్ యాంకర్ అనసూయతో ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేసి ఉంటారని చెప్పుకొంటున్నారు. మరి.. రంగస్థలంలో సోనాక్షి ఐటమ్ సాంగ్ ఉందా.. ? లేదా.. ?? అని తెలియాలంటే చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సిందే.