‘స్పైడర్’ పవన్’కి ముందస్తు హెచ్చరిక

pawan-25th-look2

భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’కు నష్టాలు మిగలడం ఖాయమని తేలిపోయింది. ఈ పరిస్థితికి చిత్రబృందం పలు విషయాల్లో చేసిన ఆలస్యమే ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించడానికి చిత్రబృందానికి దాదాపు యేడాది పట్టింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతి విషయంలోనూ జాప్యం జరిగింది. దీంతో… సినిమాపై ప్రేక్షకుడికి సరైన అంచాన ఏర్పడలేదు.

ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ కళ్యాణ్ 25వ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందని చెబుతున్నారు. పవన్ పుట్టిన రోజు కానుకగా కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చెసిన చిత్రబృందం..ఇప్పటి వరకు టైటిల్ ని ఖరారు చేయలేదు. టీజర్, ట్రైలర్ ల ఆలోచనే చేయలేదు. దీంతో.. అసలు పవన్ సినిమా లైన్ ఏంటీ, ఎలా ఉండబోతుంది.. ? అనే విషయాల్లో అభిమానుల్లో సందేహాలున్నాయి. సడెన్ గా రిలీజ్ కి ముందే భారీ అంచనాలు పెంచేసి రిలీజ్ చేస్తే.. స్పైడర్ రిజల్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు. మరీ.. స్పైడర్ పరిస్థితిని చూసి పవన్ చిత్రబృందం అలర్ట్ అవుతుందేమో చూడాలి.