శ్రీదేవికి మద్యం అలవాటు ఉందా ?

మహానటి సావిత్రి జీవిత గాథ తెలిసిందే. వెండితర రాణి అనిపించుకొన్న ఆమె జీవితపు ఆఖరి రోజుల్లో తాగుడుకు బానిసై బక్కచిక్కిపోయి.. మృత్యువాత పడింది. ఇప్పుడు అతిలోక సుందరి శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు ఉందా ? అనే డౌటు కలుగుతుంది. ఎందుకంటే ? ఆమె పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో మద్యం సేవించినట్టు నిర్థారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు మద్య అలవాటైనా ఉండాలి. లేదంటే ఆమె చేత బలవంతంగా ఆపని చేయించి ఉండాలని అనుమానిస్తున్నారు.

మరోవైపు, శ్రీదేవి అసలు హార్డ్ లిక్కర్ తాగనే తాగరని సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ అంటున్నారు. అలాంటప్పుడు ఆమె శరీరంలో ఆల్కహాల్ ఎలా ఉంటుంది ? ఆయన ప్రశ్నిస్తున్నారు. తనలాగే ఆమె కూడా అప్పుడప్పుడు కొంత మోతాదులో వైన్ మాత్రమే తీసుకునేవారని ఆయన పేర్కొన్నారు. అమర్ సింగ్ మాటలు, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తో శ్రీదేవి తాగుడు అలవాటు ఉన్నది స్పష్టం అవుతోంది. అది ఏ రేంజ్ లో అన్నది మాత్రం తెలీదు.