ఎన్టీఆర్ – శ్రీనివాస్ రెడ్డి దూరం కావడానికి కారణం వారేనా..?

కమెడియన్ గా హీరో గా వరుస అవకాశాలతో బిజీ గా గడుపుతున్న శ్రీనివాస్ రెడ్డి..తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు , ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ చాలామందికి దగ్గరిగా ఉంటాడు..స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ స్నేహితుల్లో శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. శ్రీనివాసరెడ్డి కూతురుకి పేరుపెట్టడంతో పాటు ఉయ్యాల ఫంక్షన్ వెళ్లి ఎన్టీఆర్ ఆశీర్వదించారు. అయితే తరువాతి కాలంలో ఎన్టీఆర్ కు దూరం అయ్యాడు శ్రీనివాస్.

‘నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు దూరంకావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకు పెళ్లి కావడం.. నేను వేరే సినిమాల్లో ఉండటం.. నాకు ఇచ్చిన రోల్‌లో ఇంపాటెన్స్ లేదనుకుని వద్దులే అనుకోవడం.. ఇలా చాలా రకాల కారణాలతో ఎన్టీఆర్ సినిమాలతో గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే.

అయితే ఈ గ్యాప్ రావడానికి ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అయ్యారు. వాస్తవానికి ఎన్టీఆర్‌కి అలాంటి ఆలోచన లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్లు ఫోర్స్ చేయడం వల్ల ఆయన కూడా ఇది నిజమేనేమో అనుకుని ఉండొచ్చు. అందువల్లే నన్ను కట్ చేసి ఉండొచ్చు అని తెలిపాడు. మరి శ్రీనివాస్ ను దూరం చేసిన ఆ వ్యక్తులెవరో మాత్రం తెలుపలేదు.