‘దర్భార్’పై దాడి జరిగిందా ?


ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్‌’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఓ కళాశాలలో పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులు దర్భార్ చిత్రబృందంపై దాడి చేసినట్టు సమాచారమ్.

షూటింగ్ సమయంలో విద్యార్థులని ఎవరినీ చిత్రబృందం చూడనివ్వడం లేదు. సినిమా లీక్ అవుతుందనే భయంతో విద్యార్థులని షూటింగ్ కి దూరంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో చిత్రబృందానికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో చిత్రబృందంపై విద్యార్థులు రాళ్లు రువ్వినట్లు సమాచారం. దీనిపై దర్శకుడు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారమ్.