సబితా ఇంద్రారెడ్డి పాత్ర లో సుహాసిని..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెల్సిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. అలాగే వైఎస్ స్నేహితుడు కేవీపీ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక మరికొన్ని పాత్రల కోసం చిత్ర యూనిట్ నటి నటుల ఎంపికలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యం లో తాజాగా ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ సుహాసిని ని ఒక పాత్ర కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వెలిగిన సబితా ఇంద్రారెడ్డి క్యారెక్టర్ కోసం సుహాసిని ని ఒకే చేసినట్లు సమాచారం. ఇటీవలే ఈమె వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ లో సినిమాలో వరుణ్ తల్లి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక వైఎస్ కూతురు షర్మిల పాత్ర కోసం భూమికను అనుకున్నట్లు టాక్ వచ్చినా భూమిక ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫెమ్ ఆశ్రితను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి వైఎస్ కథ కు తగ్గట్టు నటి నటులను ఎంచుకుంటూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచుతున్నారు.