‘వీర మహాదేవి’గా సన్నీ సేమ్ టచ్ !

బాలీవుడ్ ఐటమ్ భామ సన్నీలియోన్ ‘వీర మహాదేవి’గా మారనుంది. కత్తి పట్టి వీరత్వం చూపనుంది అనగానే చాలా మందికి డౌటు కొట్టింది. రొమాంటిక్ టచ్ మాత్రమే తెలిసిన సన్నీ వీరత్వం చూపించగలదా ? అంటూ అనుమానాలు రేకెత్తాయి. ఐతే, సన్నీ ఛాలెంజ్ గా తీసుకొంది. ‘వీర మహాదేవి’గా మెప్పించనుందని చెప్పుకొన్నారు.

ఏకంగా రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ ‘వీర మహాదేవి’ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఇటీవలే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘వీర మాహాదేవి’ ఫస్ట్ లుక్ అంటూ రెండు పోస్టర్స్ ని వదిలారు. ఈ రెండింటిలోనూ ఏకోశాన సన్నీలో వీరత్వం కనిపించడం లేదు. శృంగారం తప్ప. చేత్తో పేర్చిన ఇటుకలని పగలగొడుతున్న ఫోటో, టాబ్ లో జలకాలాడుతున్న ఫోటో ను వదిలారు. ఈ రెండింటిలోనూ సన్నీ పాత టచ్ లో కనిపించింది. ఇలాగైతే.. వీర మహాదేవికి సన్నీ న్యాయం చేసినట్టేననే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి.

ఈ చిత్రానికి దర్శకుడు వి.సి.వడివుడయన్. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.