సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ బాగా ఎదిగిపోయాడు. ఏరకంగా అంటారా. ? హైటు.. లుక్కూల్లోనూ. ఇటీవలే మహేష్ ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ దిగిన... మహేష్ తనయుడు ఎదిగిపోయాడు..

gautam-05-1483600279 (1)
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ బాగా ఎదిగిపోయాడు. ఏరకంగా అంటారా. ? హైటు.. లుక్కూల్లోనూ. ఇటీవలే మహేష్ ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో గౌతమ్ బాగా ఎదిగిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ప్రిన్స్ భుజాల వరకు ఎదిగాడు గౌతమ్.

ఇక, ఓ ఫోటోలో తండ్రి-కొడుకులు కలసి ఓ పోజుచ్చారు. అచ్చం సూపర్ స్టార్ పోజులో గౌతమ్ నిలబడి ఆకట్టుకొన్నాడు. ఇప్పుడీ బుల్లి సూపర్ స్టార్ ని చూసుకొని మహేష్ బాబు ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఇప్పటికే గౌతమ్ మహేష్ ‘వన్ – నేనొక్కడినే’ తెరపై ఎంట్రీ ఇచ్చాడు కూడా. అయితే, ఇప్పుడు గౌతమ్ తో సినిమా తీయాలంటే యవ్వనంలోని ప్రేమకథని తీసెయొచ్చు. అంతగా ఎదిగిపోయాడు గౌతమ్. కావాలంతే.. ఈ పిక్ ని మీరే చూడండి.

ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ కలయికలో ఓ చిత్రం చేస్తోన్న విష్యం తెలిసిందే. ఇటీవలే అహ్మదాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొన్న ఈ చిత్రం.. ఈనెల 7 నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది.

లేటెస్ట్ గాసిప్స్