సూపర్ స్టార్స్ గురువుగారి రుణం తీర్చులేరా?

సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లు ఇద్దరు తాము కె. బాలచందర్ శిష్యులమని గొప్పగా చెప్పుకొంటారు. ఇది నిజమే. వీరి టాలెంట్ ని మొదట గుర్తించింది, తొలి అవకాశం ఇచ్చింది కూడా బాలచందర్ నే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు గురువారి రుణం తీర్చుకొనే అవకాశం ఈ సూపర్ స్టార్స్ కి వచ్చింది. కానీ, ఇద్దరిలోఏ ఒక్కరు కూడా అందుకు ముందడుగు వేయకపోవడం గమనార్హం.

బాల చందర్ మరణం తర్వాత ఆయన ఆస్తులని యూకో బ్యాంక్ వేలం వేయాలని ప్రయత్నిస్తోంది. అప్పట్లో గురువుగారు ఇళ్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. వీటిలో చాలా రుణం చెల్లించాం. మిగితాది సింగిల్ సెటిల్ మెంట్ లో చెల్లిస్తామని కవితాలయ ప్రతినిథులు చెబుతున్నారు. మరోవైపు, బ్యాంకు వేలం వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్స్ గురువు గారి ఆస్తులని వేలం వేయకుండా అడ్డుకొంటారని ఆశించిన బాలచందర్ అభిమానులకి నిరాశే కలిగింది.