ధోనితో మహేష్ హీరోయిన్ లవ్ ఎఫైర్ !

Sushant Singh Rajput and Kriti Sanon celebrated New Year together!
సూపర్ మహేష్ బాబు ‘వన్ – నేనొక్కడినే’లో హీరోయిన్ గా నటించింది కృతి సనన్. ఆ తర్వాత తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన పెద్దగా పేరు రాలేదు. దీంతో.. మకాంని బాలీవుడ్ కి మార్చేసింది. ఇప్పుడు అక్కడ లవ్ ఎఫైర్ తో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్ ధోని బయోపిక్ లో అచ్చం ధోని కనిపించి కనువిందు చేశాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ధోని బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ధోనిగా చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి మంచి పేరొచ్చింది.

ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – కృతి సనన్ పీకలోతు ప్రేమతో ఉన్నట్టు బాలీవుడ్ టాక్. ఈ జంట న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం లండన్ చెక్కిసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ జంట ఇప్పటి వరకు బయట కనిపించలేదట. మరీ.. ఈ లవ్ ఎఫైర్ మేటర్ పై ఈ జంట ఏం సమాధానం చెబుతుందో చూడాలి.