సైరా కష్టాలు ఇప్పట్లో తగ్గేలా లేవు..

ఏ క్షణాన చిరంజీవి సైరా నరసింహారెడ్డి మొదలు పెట్టాడో..అప్పటి నుండి ఏదో ఓ కష్టం చిత్ర యూనిట్ ను వెంటాడుతూనే ఉంది. సాంకేతిక వర్గం నుండి షెడ్యూల్ వరకు అన్ని కష్టాలే..ఏదోలా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నప్పటికీ , రెండో షెడ్యూల్ మాత్రం అదిగో పులి ఇదుగో తోక తరహాలో వాయిదాలు పడుతూనే ఉంది. గత ఆరు నెలల క్రితం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చింది. కానీ ఇప్పటివరకు రెగ్యులర్ సినిమా మాత్రం సెట్స్ పైకి రాలేదు.

మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తప్పుకున్నాక మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంత వరకు ఫైనల్ చేయలేదు. తమన్, కీరవాణి, మణిశర్మ పేర్లు వినిపిస్తున్నాయి కాని ఏది తేల్చడం లేదు. మరోపక్క ఫిలిం సర్కిల్లో సైరా స్క్రిప్ట్ ని ఇప్పటి దాకా 10 రచయితలు చూసారని , పరుచూరి బ్రదర్స్ అసలు రైటర్స్ అయినప్పటికీ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు కీలకమైన మార్పుల కోసం లేటెస్ట్ సెన్సేషన్ సాయి మాధవ్ బుర్ర మొదలుకుని ఎప్పుడో సినిమాలు మానేసిన సత్యానంద్ వరకు చిరు అందరిని రంగంలోకి దించారని అంటున్నారు. ఇక ఈ వార్తలన్నీ చూసి మెగా అభిమానులు ఈ సినిమా అసలు తెరకెక్కుతుందో లేదో..ఒకవేళ తెరకెక్కిన కానీ ఆకట్టుకునేలా ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.