సైరాను దెబ్బతిస్తున్నాడు…

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూవీ సైరా నరసింహ రెడ్డి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. కిక్ , రేసు గుర్రం , ధృవ చిత్రాల ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫై చిత్ర ఇండస్ట్రీ తో పాటు మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవలే మొదటి షెడ్యూల్ ముగించుకున్న ఈ మూవీ , త్వరలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతుంది. అయితే ఈ మూవీ కి ఓ వ్యక్తి వల్ల ముప్పు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

సదరు వ్యక్తి తన స్వార్థం కోసం సినిమాలు సంబదించిన విశేషాలను లీక్ చేస్తున్నాడట. తనకు హైప్ రావడం కోసం, మీడియాతో తన సత్సంబంధాలు కొనసాగడం కోసం తరచు సినిమాకు సంబదించిన అన్నింటిని బయటకు లీక్ చేస్తున్నాడట. లీకులు అందిన వారు ఒకలా రాస్తుంటే, మరికొన్ని చానెల్స్ వారు వాటికీ , ఇంకాస్త జోడించి లేనిపోనివి జత చేసి పబ్లిసిటీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాకు రాబోయే రోజుల్లో ముప్పు వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయం చిత్ర యూనిట్ తెలుసుకొని అతడిని కంట్రోల్ లో పెడితే బాగుంటుంది.