తమన్నా స్పెషల్ ఆఫర్

tamanna-bhatia

మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ ఆఫర్’ని ప్రకటించినట్టు సమాచారమ్. బాహుబలి తర్వాత తమన్నా మరో సినిమా చేయలేదు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’లో ఐటమ్ సాంగ్’లో మెరిసింది. ఈ సాంగ్ కోసం రూ. 60లక్షలు తీసుకొన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తమ్మూ చేతిలో తెలుగు ‘క్వీన్’ రిమేక్, కళ్యాణ్ రామ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. . ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ స్పెషల్ ఆఫర్ ప్రకటించేసిందని చెబుతున్నారు.

తన పారితోషికంలో డిస్కౌంట్ ఇచ్చిందని టాలీవుడ్ సమాచారమ్. ఈ స్పెషల్ ఆఫర్ కళ్యాణ్ రామ్ సినిమా ఇవ్వనుందట. అసలే అవకాశాలు తగ్గాయి. ఇలాంటి టైంలో స్పెషల్ డిస్కౌంట్ లు ఇచ్చి ఆకట్టుకోవాల్సిందేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. తమ్మూ మాదిరిగా సీనియర్ హీరోలు కూడా స్పెషల్ ఆఫర్లు ఏమైనా ప్రకటిస్తారేమోనని దర్శక-నిర్మాతలు ఆశపడుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్స్ కాజల్, అనుష్క, త్రిషలకి ఇప్పటికీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వాళ్ల నుంచి స్పెషల్ ఆఫర్లు ఆశించడం తీరని కోరికే అవుతుందేమో !