తేజ సెట్స్ నుండి వాకౌట్..?

సినీ దర్శకుడు తేజ సీత సెట్స్ నుండి బయటకు వెళ్లిపోయాడా..అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ఇండస్ట్రీ లో తేజ వైఖరి చాల విభిన్నంగా ఉంటుందని అంత చెపుతుంటారు. ఆయన అనుకుంటే అది జరిగిపోవాల్సిందే..ఏమాత్రం ఆ విషయంలో రాజీ పడడు. కథల విషయంలోనైనా…నిర్మాణ విషయంలోనైనా..నటి నటుల ఎంపికలోనైనా. ఈయన మొండి తీరు వల్లే సినిమా సినిమాలు పక్కవారికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం బెల్లం కొండ శ్రీనివాస్ తో సీత అనే సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా చిత్ర సెట్ లో బెల్లం కొండ – తేజ ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. శ్రీను ను గడ్డం పెంచాల్సిందిగా తేజ కోరితే ఆ పనిని శ్రీనివాస్ చేయలేకపోయాడట. దాంతో తేజ సీరియస్ అయ్యి సెట్స్ నుంచి వాకౌట్ చేశాడని అంటున్నారు. అయినా ఈ సినిమా చిత్రీకరణ ఆగదు.. మొత్తం పూర్తి చేస్తానని తేజ అన్నారట. బెల్లంకొండ శ్రీనివాస్ గెడ్డం పెంచానని తేల్చి చెప్పడం తో.. ఆ గడ్డాన్ని సీజీ వర్క్ లో మ్యానేజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.