స్టార్ హీరోయిన్ల ఫేవరేట్ హీరోలు.. వీరే !

ప్రేక్షకులకు ఫేవరేట్ హీరో ఉన్నట్టే. హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ కూడా ఫేవరేట్ హీరో ఉంటాడు కదా. ఈ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఫేవరేట్ హీరోలు ఎవరో తెలుసా ? తెలుసుకోవాలంటే ఈ చిన్ని కథనంని చదివేయండీ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో స్వీటీ అనుష్క ఒకరు. ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్ అంటే మహా ఇష్టం. వీరిద్దరు ప్రేమలో ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులని ఫిదా చేసిన సాయి పల్లవి ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. థియేటర్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమాని చూసే పవన్ ఫాలోయింగ్ ని చూసి షాక్ అయిందట.

రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరేట్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుతో నటించిన తర్వాతే పెళ్లి చేసుకొంటానని అప్పట్లో ప్రతిజ్ఝ కూడా చేసింది. ఐతే, స్పైడర్ సినిమాలో మహేష్ నటించి తన కోరికని తీర్చుకొంది. కాజల్ ఫేవరేట్ హీరో మన్మథుడు నాగార్జున. ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలని ఆశపడింది. ఇప్పుటీ ఆ కోరిక తీరలేదు. నివేదా థామస్ ఫేవరేట్ హీరో ఎన్టీఆర్. జై లవ కుశ సిమాలో తారక్ నటనని చూసి ఫిదా అయిపోయిందట.