త్రివిక్రమ్ తో నాని.. నిజమేనా ?

అజ్ఞాత‌వాసి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే బిజీలో వున్నారు. ఈ నెల‌లోనే మూవీ ప‌ట్టాలెక్క‌నుంది. అయితే ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ బాబు, వెంక‌టేశ్‌ల‌తో త్రివిక్ర‌మ్‌ సినిమా ఉంటుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

కాని అంత‌కంటే ముందే నానితో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. డీవివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వారిద్దరూ జతకట్టడం ఈ ఏడాది కష్టమే. 2019లో వీరి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. నాని ఇంతవరకు ఒక్క సినిమా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయలేదు. దీంతోసహజంగానే వీరి కాంబినేషన్ పై ఆసక్తిపెరిగింది;