లవ, కుశులు త్రివిక్రమ్’ని మార్చారు

ntr

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వచ్చే యేడాది జనవరిలో సినిమా ప్రారంభం. మార్చి నుంచి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు చెబుతున్నారు. త్రివిక్రమ్ సినిమాలో తారక్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పుకొన్నారు. అయితే, ‘జై లవ కుశ’ సినిమా చూశాక త్రివిక్రమ్ తన అభిప్రాయాన్ని మార్చుకొన్నట్టు తెలుస్తోంది.

‘జై లవ కుశ’ సినిమాలో లవ, కుశలు చేసిన కామెడీ త్రివిక్రమ్ ని బాగా ఆకట్టుకొందట. దీంతో తారక్’తో తీయబోయే సినిమాలో వినోదం పాళ్లు పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని త్రివిక్రమ్ తారక్ కి చెప్పడం. ఆయన మీ ఇష్టం అంటూ ఓకే చెప్పడం జరిగిపోయాయని చెబుతున్నారు. మరీ.. యాక్షన్ సంగతేంటీ ? అంటే యాక్షన్ కూడా ఉంటుంది. అంతకంటే ఎక్కువ పాళ్లు వినోదం ఉండనుంది అన్నమాట. మరీ.. రెండింటికి ఒకే కత్తిలో త్రివిక్రమ్ ఎలా ఇమిండిపజేస్తారనేది చూడాలి.