వరలక్ష్మీని టచ్ చేయలేదు


కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. జై సింహా తర్వాత వీరి కలయిలో రాబోతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం రూలర్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా కోసం విలన్ గా జగపతి బాబుని తీసుకొన్నారు. ఆయనది సినిమాలో డ్యుయెల్ రోల్ అనే వార్తలొచ్చాయ్. విలన్ డబుల్ యాక్షన్ అన్న లైన్ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారనే న్యూస్ బయటికొచ్చిండి. ఈ ప్రచారంపై నిర్మాత సి స్పందించారు. వరలక్ష్మి విలన్ కాదు. అసలు ఆమె సినిమాలోనే నటించడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు జగపతిబాబును మాత్రమే తీసుకున్నామని స్పష్టం చేశారు. త్వరలో రూలర్ మొదలు కానుంది.