ఎన్టీఆర్ వైసీపీ ప్రచారం

Ram-gopal-Varma-NTR-Biopic

‘మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నా’నని నందమూరి బాలకృష్ణ ప్రకటన చేసి తెలుగు ప్రజల్లో ఆనందాన్ని నింపారు. అయితే, దీని వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎన్ టీఆర్ బయోపిక్ 2019 టీడీపీ ఎన్నికల ప్రచార అస్త్రం అనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద సంఘటనలని టచ్ చేయడం లేదు. ఎన్ టీఆర్ సీఎం అయ్యేంత వరకే చూపిస్తామనే లీకులు బయటికొచ్చాయి.

ఇంతలోనే ఎన్టీఆర్ బయోపిక్ ని తీయబోతున్నట్టు ప్రకటించడం గర్వంగా ఉందని ఓ వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే, బాలకృష్ణ, వర్మలు ప్రకటించిన ఎన్ టీఆర్ బయోపిక్ ఒకటేనని ప్రజలు భావించారు. బాలకృష్ణ నిర్మించే ఎన్ టీఆర్ బయోపిక్ కి వర్మ దర్శకత్వం వహించబోతున్నాడని అనుకొన్నారు. కొన్నాళ్లకి అది నిజం కాదని తేలింది. బాలకృష్ణ, వర్మ లు తీయబోయేది రెండు వేరు వేరు ఎన్ టీఆర్ బయోపిక్ లు అన్న విషయం స్పష్టమైంది.

వర్మ తీయబోయే ఎన్ టీఆర్ బయోపిక్ కి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పెట్టడంతో.. బోలేదు వివాదాలని మోసుకొస్తుందని అర్థమైంది. ఈ సినిమా నిర్మాత వైసీపీ నేత రాకేష్ రెడ్డి అని తేలడంతో.. లక్ష్మీస్ ఎన్ టీఆర్ 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ ప్రచార అస్త్రం కాబోతునట్టు తెలుస్తోంది. మొత్తానికి.. ఎన్ టీఆర్ ని వచ్చే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వాడుకోవాలని అటు టీడీపీ, ఇటు వైసీపీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.