వరుణ్ తేజ్ మరోటి

వరుణ్ తేజ్ మరో సినిమాకి సైన్ చేశాడు. నారా రోహిత్- శ్రీ విష్ణు ప్రాధన పాత్రలో వచ్చిన ఏసిని అ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు ప్రసంసల జల్లు కురిపించారు. ఓ మంచి సినిమా తీశాడు అనే కితాబు అందుకున్నాడు దర్శకుడు సాగర్ చంద్ర.

ఇపుడు వరుణ్ కి కధ చెప్పాడు. ఈ కధకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. . 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వరుణ్.