బన్నీ తో కాదట వెంకీతోనట..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఎవరితో చేస్తాడు అంటే నిన్నటి వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తోనేననే వార్తలు బలంగా వినిపించాయి. కానీ తాజాగా మాత్రం త్రివిక్రమ్ నెక్స్ట్ వెంకీ తో చేస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది.

వాస్తవానికి గతంలోనే వెంకీ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ప్రచారం అయ్యింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడ వార్త వినిపించకపోయేసరికి ఈ ప్రాజెక్ట్ కాన్సల్ అయ్యిందని అంత అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ కాన్సల్ కాలేదట. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతుందట. మరి ఈ కాంబో కు సంబందించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వస్తుందో చూడాలి.

ప్రస్తుతం వెంకటేష్ వరుస మల్టీస్టారర్ చిత్రాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. వరుణ్ తేజ్ తోఎఫ్ 2 , నాగ చైతన్య తో మరోటి చేస్తున్నాడు.