ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ ?

విశ్వ విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. తేజ దర్శకుడు. ఎన్టీఆర్ జీవితం ఓ క‌థగా చెప్పాల్సి వ‌స్తే భార్య బ‌స‌వ‌తార‌కం పాత్రకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో స‌వ‌తార‌కం పాత్ర‌కు గానూ చాలామంది కథానాయిక‌ల పేర్లు ప‌రిశీలిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర‌బృందం విద్యాబాల‌న్‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది.

హైద‌రాబాద్‌లో బ‌స‌వ‌తార‌కం కాన్స‌ర్ ఆసుప‌త్రి స్థాప‌న వెనుక‌… బ‌స‌వ‌తార‌కం ఆశ‌లు, ఆశ‌యాలూ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఓ స‌న్నివేశం కంట‌త‌డిపెట్టించేలా ఉంటుంద‌ని, ఆ స‌న్నివేశం పండాలంటే.. క‌చ్చితంగా భావోద్వేగాలు పండించ‌గ‌ల న‌టీమ‌ణి అవ‌స‌రం అని యూనిట్ భావించారు. అందుకే ఆ పాత్ర కోసం పేరున్న న‌టీమ‌ణుల్ని ప‌రిశీలించారు. ఆ అవ‌కాశం విద్యాబాల‌న్‌కి ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది.