గల్లీ బాయ్ విజయ్


జోయా అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటించిన చిత్రం ‘గల్లీ బాయ్’. ఈ యేడాది ఫిబ్రవరి 14 ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాన్ని అందుకొంది. దాదాపు రూ. 40కోట్ల బడ్జెట్ తోతెరకెక్కిన గల్లీ బాయ్ ఏకంగా రూ. 230కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ని తెలుగులోకి తీసుకొచ్చేందుకు గీతా ఆర్ట్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. హీరోగా ముందుగా సాయిధరమ్ తేజ్ పేరు వినిపించింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. గత చిత్రాలలో విజయ్‌ దేవరకొండ అభినయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంలోని పాత్రకు పూర్తిగా సరిపోతారని భావించి..నిర్మాతలు ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారని పరిశ్రమలో వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో పూర్తి చేయాల్సిన సినిమాలు మూడ్నాలుగు ఉన్నాయి. మరీ.. ఆయన తెలుగు గల్లీ బాయ్ అవుతాడేమో చూడాలి.