ప్రియాంక బెడ్ రూమ్ పిక్’పై దుమారం !

అవకాశం ఇస్తే అన్నీ చూపించినట్టు.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బెడ్ రూమ్ లో భర్తతో తీసుకున్న ఫోటోని షేర్ చేసింది. ఇప్పుడీ ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత ఓవర్ ప్రచారం అవసరమా..? అంటూ ప్రియాంకని ప్రశ్నిస్తున్నారు. బెడ్ రూమ్ లో కూడా ఫోటోగ్రాఫర్ ని పెట్టుకున్నారా.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది డిసంబర్ లో హాలీవుడ్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ని ప్రియాంక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం ఈ జంట కాలిఫోర్నియాలో కాపురముంటున్నారు. ఈ క్రమంలో తన భర్త, కుటుంబంతో కలిసి తీసుకుంటున్న కొన్ని ఫోటోలను ప్రియాంక సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. వాటిని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగని.. బెడ్ రూం ఫోటోలని కూడా షేర్ చేసే సరికి నెటిజర్స్ ని రియాక్షన్ లో తేడా వస్తోంది. ఇకపైనైనా.. ప్రియాంక కాస్త ప్రైవసీ మెయిన్ టైన్ చేస్తే మంచిది.