నాగ్ దర్శకుడితో రవితేజ
కింగ్ నాగార్జునకు ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ దర్శకుడు టాలెంట్ మెచ్చి వెంటనే అవకాశం ఇచ్చాడు నాగ్. నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తీశాడు. అది సూపర్ హిట్టే. అయితే, నాగార్జున హీరోగా ‘బంగ్గార్రాజు’ సినిమా తీసేందుకు ఈ దర్శకుడు ప్రయత్నించాడు. కానీ, కుదరలేదు. అయితే, ఇప్పుడీ దర్శకుడు మాస్ మాహారాజు రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారమ్.... Read more
మహానటి : ఆ కళ్లను ఎవ్వరూ దాచలేరు
యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ లీడ్ రోల్’లో ‘మహానటి’ సావిత్రి జీవితగాధ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకుడు. ప్రస్తుతం జెడ్ స్వీడుతో షూటింగ్ కొనసాగుతోంది. ఈరోజు హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మహానటి’ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ పేరుతో మహానటి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దీంతో.. కీర్తి సురేష్... Read more
శర్వానంద్ డబుల్ యాక్షన్
టాలీవుడ్’లో హవా చూపిస్తున్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఈ యేడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకొన్నాడు శర్వా. శతమానం భవతి, మహానుభావుడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ యేడాది శర్వా మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ సినిమా తెరకెక్కనుంది. ఇందులో శర్వా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమాలో... Read more
సింగర్స్’కి వేధింపులు తప్పడం లేదు
సినీ ఇండస్ట్రీలో చీకటి కోణంపై ఇటీవలే పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించారు. స్టార్ హీరోయిన్స్ సైతం తమను ఎదురైన చేధు అనుభవాలని మీడియా ముఖంగా పంచుకొన్నారు. అయితే, సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పై కూడా వేధింపులు జరుగుతున్నట్టు సమాచారమ్. తెలుగు సింగర్ ‘ప్రణవి’కి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి.... Read more
బూతుకు భయపడిన కమెడియన్
టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో వేణు మాధవ్ ఒకరు. కొన్నాళ్ల క్రితం వరుస సినిమాలతో ఆయన బిజీ బిజీ. అయితే, ఈ మధ్య ఆయన సినిమాల్లో కనిపించడం లేదు. అందుకు ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆర్థిక కారణాలంటూ.. ఏవేవో ప్రచారం జరిగాయి. అయితే, ఇవన్నీ అబద్దమని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తనకి అవకాశం వచ్చిన కొన్ని సినిమాల్లో బూతు ఎక్కువగా ఉండటం వలన వాటిని వదులుకొన్నా. ఆ... Read more
‘ఎన్టీఆర్ బయోపిక్’పై చంద్రబాబు స్పందన.. ఏమిటంటే ?
మహానటుడు ఎన్టీఆర్ జీవితగాధ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్’ని వర్మ కథగా ఎంచుకొన్నారు. ఈ సినిమాకి వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దీంతో.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై రాజకీయ పులుము అంటుకొంది. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని టీడీపీ నేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వర్మ, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి... Read more
‘రాజా ది గ్రేట్’ కథ.. సింపుల్’గా !
మాస్ మహారాజ రవితేజ హీరోగా అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ దీపావళీ కానుకగా రేపు (బుధవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత రాబోతున్న రవితేజ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్ర దర్శకుడు అనిల్ రాఘవపూడి.. ‘రాజా ది గ్రేట్’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.... Read more
బర్త్ డే పిక్ : మహానటి సావిత్రి
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సావిత్రి తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జెడ్ స్వీడుతో షూటింగ్ జరుగుతోంది. కీర్తి సురేష్ లీడ్’లో పోషిస్తున్న ఈ సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. ఈరోజు కీర్తి సురేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ‘మ‌హాన‌టి’ సావిత్రి ఫస్ట్ లుక్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. పోస్టర్ పై ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’... Read more
లైవ్’లోనే మెగా హీరో తిక్క చూపించాడు !
మెగా యంగ్ హీరో లైవ్’లోనే తిక్క చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజు. అయితే, ఈ మధ్య ఒకట్రెండు ప్లాపులతో లెక్క తప్పినట్టు కనిపించాడు. అయితే, ‘జవాన్’లా మారి విజయం కోసం పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు, మాస్ దర్శకుడు వివి. వినాయక్ తో ఓ యాక్షన్ సినిమాని చేస్తున్నాడు. అయితే, ఇంతటి బిజీలో... Read more
‘మాయ బజార్’లో సమంత !
అలనాటి క్లాసిక్ ‘మాయ బజార్’లో సమంత కనిపించనుంది. ఈరోజే షూటింగ్ లో పాల్గొననుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది. ఇందులో సమంత కీలక పాత్రలో కనిపించనుంది. ఆమెది జర్నలిస్టు పాత్రని చెబుతున్నారు. ప్రస్తుతం నాటి క్లాసిక్‌ ‘మాయాబజార్‌’లో సావిత్రి చేసిన శశిరేఖ పాత్రకు సంబంధించిన సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. పెళ్లి తర్వాత తొలిసారి షూటింగ్ కు... Read more
మొహమాటం లేకుండా చెప్పేసింది
సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 102 సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నారు. ఇప్పటికే నయనతార, నటాషా దోషీలని చిత్రబృందం ఎంపిక చేసింది. మిగిలిన మూడో హీరోయిన్ కోసం చిత్రబృందం కొద్దికాలంగా వెతుకుతోంది. ఈ క్రమంలో హీరోయిన్ రెజీనా పేరు తెరపైకి వచ్చింది. అయితే, మొదట బాలయ్య సినిమాకి నో చెప్పిన రెజీనా.. ఆ తర్వాత ఓకే చెప్పిందని... Read more
అన్నయ్య హీరోయిన్’కు తమ్ముడంటే ఇష్టం
మెగాస్టార్ చిరంజీవితో కలిసి సరి సమానంగా డ్యాన్ చేయగల హీరోయిన్స్ లో భానుప్రియ ఒకరు. వీరిద్దరి కలయికలో చాలా సినిమాలోచ్చాయి. వీటిలో బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె తెరపై కనిపిస్తే నిండుదనం వస్తుంది. అయితే, ఈ సీనియర్ హీరోయిన్’కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. ఆయనతో కలిసి నటించాలని ఉందని చెబుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయీన్ భానుప్రియకు... Read more
లేటెస్ట్ గాసిప్స్