‘118’ రిలీజ్ డేటు ఫిక్స్ !

గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘118’. నివేతా థామస్, షాలిని పాండే హీరోయిన్లు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తోంది. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేటు ఫిక్సయింది. మార్చి 1న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. కథలో 118 నెంబర్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉండటంతో అదే టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ‘పటాస్‌’ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన మళ్లీ.. ఇజం, ఎమ్మెల్యే సినిమాలతో వరుసగా ప్లాపులు పలకరించాయి. ఈ నేపథ్యంలో 118తో హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి రావాలని కళ్యాణ్ ఆశపడుతున్నారు.