ఒక్క మిస్ కాల్ తో రోబో 2 పాయింట్ టికెట్స్ పొందవచ్చు..

శంకర్ – రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 (రోబో 2) కోసం యావత్ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే..రోబో తర్వాత వీరిద్దరి కాంబో లో సినిమా రాబోతుండడం , బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ మూవీ లో విలన్ రోల్ చేయడం , ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో నిర్మించబడడం ఇవ్వన్నీ ఈ సినిమాపై ఆశలు పెంచింది.

ఈ మధ్యనే విడుదలైన మేకింగ్ వీడియో సైతం సినిమా ఫై ఆసక్తిని పెంచింది. ఇక ఈనెల 13 న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ కోసం తమిళనాడులో పెద్ద ఎత్తున థియేటర్స్ ను ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. 3డి లో రిలీజ్ చేయబోతున్న ఈ టీజర్ చూసేందుకు టికెట్స్ ను ఫ్రీగా అందిస్తున్నది లైకా ప్రొడక్షన్స్. ఫ్రీ టికెట్స్ కావాలనుకునేవారు +91 9099949466 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్లకు థియేటర్స్ లో టీజర్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులోని చెన్నై, మధురై, తిరుచ్చి, దిండిగల్, తంజావూర్, పుదుకోట్టై తదితర చోట్ల ఉన్న థియేటర్స్ లో రోబో 2 పాయింట్ ఓ టీజర్ ను ప్రదర్శించబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలిపింది.

ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే ఆ నెం కు మిస్ కాల్ ఇచ్చి ఫ్రీ గా ఆ టీజర్ చూసెయ్యండి.