నైజాంలో ‘2.ఓ’ లెక్కెంత ?

విజువల్ వండర్ ‘2.ఓ’ కలెక్షన్స్ లో అదరగొడుతోంది. విడుదలైన అన్నీ బాషల్లోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో బాహుబలి రికార్డుని బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ చిట్టి కలెక్షన్స్ లో అదరగొడుతున్నాడు. నైజాంలో వారంరోజుల్లో 17కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఆక్కడ ఈ రేంజ్ లో వసూళ్ళు రాబట్టడం ఇదే మొదటిసారి. ఇక, ప్రపంచ వ్యాప్తంగా 2.ఓ కలెక్షన్స్ రూ. 500కోట్ల మార్క్ ని దాటేశాయని ట్రేడ్ వర్గాల సమాచారమ్.

‘2.ఓ’కి శంకర్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా, ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటించారు. దాదాపు రూ. 547కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పుడీ విజువల్ వండర్ వసూళ్లు ఆ రేంజ్ లోనే ఉండటంతో చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.