మహర్షిలో ఎనిమిది పాటలు ?


సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్
సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సినిమా పాటలు మైనస్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇప్పటివరకు బయటికొచ్చిన రెండు పాటలు ప్రేక్షకులని పెద్దగా ఎక్కలేదు. రెండో పాటపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐతే, మహర్షి సినిమాలో ఏకంగా ఎనిమిది పాటలు ఉండబోతున్నాయట. ఇందులో ఆరు స్ట్రయిట్ సాంగ్స్, రెండు బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ మాదిరిగా వినిపించే సాంగ్స్ అంట. ఈ మధ్య సినిమాల్లో ఐదు పాటలు మాత్రమే ఉంటున్నారు. మహర్షి ఏకంగా 8 పాటలతో వస్తున్నాడు. మరీ.. మురిపిస్తాడో లేదో చూడాలి.