ఆకాష్ పూరి ‘రొమాంటిక్’


మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టే.. పూరి తనయుడు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ అనిపించుకొన్నాడు. ‘మెహబూబా’ తర్వాత తనయుడు ఆకాష్ తో పూరి మరో సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఆ సినిమాకి ‘రొమాంటిక్’ టైటిల్ అనుకొంటున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమాకు ‘రొమాంటిక్’ టైటిల్ ని ఫైనల్ చేశారు. ఐతే, ఈ సినిమాకి పూరి దర్శకత్వం వహించడం లేదు. పూరి స్కీన్‌ ప్లే, డైలాగులు, కథ అందించనున్నారు. ఆయన శిష్యుడు అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించనున్నారు.

తనయుడు సినిమాని మరో దర్శకుడి చేతిలో పెట్టిన పూరి.. ప్రస్తుతం రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నబాషా నటాషా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఛార్మితో కలిసి పూరి నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ సినిమాలు దాదాపు ఏకకాలంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.