రాజమౌళి కొడుకు రికార్డు సృష్టించాడు..

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాణంలో షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న న్యూ ఏజ్ స్టోరి `ఆకాశ‌వాణి`. రాజమౌళి సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే కార్తికేయ..ఆకాశవాణి తో రికార్డు సృష్టించాడు. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజును డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఆకాశవాణి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. షూటింగ్ పూర్తయినట్లు సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌టం విశేషం. వైవిధ్య‌మైన బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో బాహుబ‌లి సిరీస్‌లో రాజ‌మౌళి అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేసిన అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.