ఎబిసిడి మరో ఎఫ్2

అల్లు శిరీష్ తాజా చిత్రం ఎబిసిడి ‘అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి’ అనేది ట్యాగ్ లైన్‌. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్ర ట్రైలర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు.

సంక్రాంత్రి సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్ 2 ప్రేక్షకులని బాగా నవ్వించింది. సమ్మర్ లో రాబోతున్న ఎబిసిడి కూడా ఆ రేంజ్ లో నవ్విస్తుందని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. ఓ ఫన్‌ మూవీని ప్రొడ్యూస్‌ చేయాలని చాలా రోజులుగా అనుకున్నాను. ఆ క్రమంలో చేసిన సినిమాయే ‘ఏబీసీడీ’. శిరీష్‌, భరత్‌ ఫెంటాస్టిక్‌గా నటించారని చెప్పుకొచ్చారు.