‘ఎబిసిడి’ ఎన్ఆర్ఐ ‘పిల్ల జమీందార్’ ?


హిట్ కోసం మొహం వాసిపోయిన మెగా హీరో అల్లు శిరీష్. ఐతే, శ్రీరస్తు శుభమస్తు శిరీష్ ని హిట్ కోరికని కొంత మేరకు తీర్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎబిసిడి’. సంజీవి దర్శకుడు. రుక్సార్ థిల్లోన్ హీరోయిన్. మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా, ఈ సినిమ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ని చూస్తే నాని పిల్ల జమీందార్ సినిమా గుర్తుకు వస్తుంది.

ఆ సినిమాకి ఎన్ఆర్ఐ బ్యాక్ డ్రామ్ ని జతచేసి ఎబిసిడి తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. ‘ఎబిసిడి’ ట్రైలర్ లో శిరీష్ ఎన్ఆర్ఐ కుర్రాడుగా కనిపించాడు. ఇండియా వచ్చి లగ్జరీ లైఫ్ కి దూరంగా చదువుకుంటున్నట్లు చూపించారు. రాజకీయాలు గట్రా ఉన్నాయి. ‘పిల్ల జమిందార్’లో కూడా రాజకీయాలు ఉన్నాయి. అయితే అవి కాలేజ్ రాజకీయాలు. మొత్తంగా ఎబిసిడి మరో పిల్లజమీందార్ ల కనిపిస్తొంది.