ఏబీసీడీ పబ్లిక్ టాక్


సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్‌ నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. రుక్సార్‌ కథానాయిక. మలయాళ చిత్రానికి రిమేక్ ఇది. ఆల్రెడీ హిటైన కథతో సేఫ్ జోన్ లో ప్లాన్ చేసుకొన్నాడు శిరీష్. టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన దక్కింది. యుఎస్ ప్రిమియర్ షోస్ భారీ ఎత్తున పడ్దాయి. చూస్తుంటే.. ఈసారి శిరీష్ కి హిట్ గ్యారెంటీ అనిపించింది. మరీ..ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఏబీసీడీ ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఏంటీ ? ఓ లుక్కేద్దాం పదండీ.. !

మాతృకలో చాలా మార్పులు చేశామని చిత్రబృందం ముందే తెలిపింది. కేవలం 15సీన్లు మాత్రమే వాడుకొన్నారు. ఐతే, ఆ మార్పులే కొంపముంచాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. కథ బలంగా లేదు. దానికి తోడు కథనం నాసిరకంగా ఉంది. సినిమా స్లో గా సాగింది. కామెడీ, ఎమోషన్స్.. ఒకటీ పండలేదు. ఫలితంగా శిరీష్ ఏబీసీడీ ప్లాప్ అని చెబుతున్నారు. ఐతే, పూర్తి రివ్యూలు వచ్చిన తర్వాతే.. సినిమా ఫలితంపై ఓ అంచనాకి రావొచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.