‘ఏబీసీడీ’ ట్రైలర్ టాక్

మెగా హీరోల రేంజ్ ని అందుకొని మెగా హీరో అల్లు శిరీష్. ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒక్కటే శిరీష్ పేరు తీసుకొచ్చింది. అయినా శిరీష్ ప్రయత్నాలు ఆగడం లేదు. ఆయన తాజా చిత్రం ‘ఏబీసీడీ’. సంజీవి దర్శకుడు. రుక్సార్ థిల్లోన్ హీరోయిన్. మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా, ఈ సినిమ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. తాను లైఫ్ లో ఎంజాయ్ మెంట్ .. ఎంటర్టైన్మెంట్ .. ఎక్సయిట్ మెంట్ నే కోరుకుంటానంటూ శిరీష్ చెప్పడం ఆకట్టుకొంది. ఇందులో ఆయనది జల్సారాయుడు టైపు పాత్రని ట్రైలర్ తో అర్థమవుతోంది. హీరో స్నేహితుడిగా భరత్ మంచి కామెడీ టైమింగ్ కనబర్చాడు. మొత్తంగా.. ట్రైలర్ ఆకట్టుకొనేలా సాగింది.