‘వివిఆర్’ యాక్షన్ సీన్ లీక్ !


మెగా అభిమానులకి అత్య్సుహం ఎక్కువైంది. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ అందుకొంది. మాస్ ఆడియెన్స్ నచ్చేలా వినయ విధేయ రాముడు ఉన్నాడని చెప్పుకొంటున్నారు. ఐతే, సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే.. సినిమాలోని హైలైట్ సీన్ సోషల్ మీడియాలో లీకైంది. అది చేసింది కూడా మెగా అభిమానులే కావడం విశేషం.

ఈ సీన్ లో తన వైపు పరుగెత్తుకొంటూ వస్తున్నా ఇద్దరు రౌడీ తలలని తెగ నరికేస్తాడు చరణ్.. వారి తలలు గాల్లో ఎగిరిపడుతుంటే సడెన్ గా డేగలొచ్చి వాటిని ఎగరేసుకుపోతాయి. దీంతో షాక్ కి గురైన విలన్ వివేక్ ఒబెరాయ్ గన్ తీసుకొని వాటిని కాల్చబోతుండట.. ఈ సీన్ లో చూడొచ్చు. ఈ సీన్ రోమాలు నిక్కబొటిచేలా ఉందని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐతే, సినిమా చూసే ప్రేక్షకులు థియేటర్స్ లో థ్రిల్ గా ఫీలవ్వకుండా ముందుగానే.. అది కూడా మెగా అభిమానులు లీక్ చేయడం అనేది విచారకరం.