నటుడు వినోద్‌ కన్నుమూత

సీనియర్‌ నటుడు వినోద్‌ కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్‌ స్ట్రోక్ తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు.హీరోగా, విలన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. పలు సీరియళ్లలోనూ నటించారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో విలన్‌గా ఎక్కువగా కనిపించేవారు.

తెలుగు, తమిళ్, హిందీ, జోథ్ పురి బాషల్లో వినోద్ నటించారు. ఆయన హీరోగా చేసిన పలు సినిమాలు మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్‌, మిర్చి.. తదితర చిత్రాల్లో వినోద్ నటనకి మంచి గుర్తింపు వచ్చింది.