ఐటెం సాంగ్ లో ఆదా శర్మ..ఎవరితోనో తెలుసా..?

పూరి తెరకెక్కించిన హార్ట్‌ ఎటాక్‌ చిత్రం తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన అదా శర్మ , ఆ తర్వాత ‘క్షణం’, ‘గరం’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కానీ ఆ రేంజ్ అవకాశాలు మాత్రం అమ్మడికి రాకపోయేసరికి , గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో రకరకాల హాట్ వీడియోలతో , ఫొటోలతో ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా ఈ భామకు ఐటెం ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

నాని – గౌతమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ మూవీ లో ఆదా శర్మ ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.

ఈ సినిమాలో ఏకంగా 8 పాటలు ఉన్నాయని సమాచారం. అందులో రెండు ఎమోషనల్ సాంగ్స్ , రెండు డ్యూయెట్ సాంగ్స్ , నాలుగు బిట్ సాంగ్స్ అని తెలుస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాని ,అర్జున్ గా మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు.