‘అదిగో’ ట్రైలర్ వచ్చేసింది !

దర్శకుడు రవిబాబు తాజా చిత్రం ‘అదిగో’. పందిపిల్ల – బంటీని కీల‌క‌పాత్ర‌లో చూపుతూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి రవిబాబు స‍్వయంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ ని విడుదల చేసింది చిత్రబృందం. బంటీ (పందిపిల్ల) చేసే సాహసాలు, కామెడీతో ట్రైలర్ ని కట్ చేశారు. తెలుగులో ‘అదుగో’ పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని.. ఇతర భారతీయ భాషలన్నింటిలో ‘బంటీ’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఒక పందిపిల్లతో దర్శకులు ఎలాంటి కథనం నడిపాడు అనేది ఆసక్తి కలిగించే అంశం. బంటి అనే పందిపిల్ల చుట్టూ కథ నడుస్తుందని అంటున్నారు. నిజమైన పంది పిల్లతో షూటింగ్‌ చేశారు. విఎఫ్‌ఎక్స్‌ సహాయం తీసుకున్నారు. ఐతే, తెరపై కనిపించే ఒక్క పంది పిల్ల కోసం వంద పందులకుపైగా పెంచాల్సి వచ్చిందట.