వరుణ్ తేజ్ తో మణిరత్నం హీరోయిన్

తొలిప్రేమతో హిట్టు కొట్టిన మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.. ఇప్పుడు ఘాజీ’ తీసిన సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ‘మే నెల నుండి ఈ మూవీ ప్రారంభంకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఆ చిత్రాన్ని వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో వరుణ్‌ సరసన కథానాయికగా అదితిరావు హైదరీని ఎంపిక చేసుకొనే అవకాశాలున్నట్టు తెలిసింది. మణిరత్నం ‘చెలియా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి, ప్రస్తుతం సుధీర్‌ బాబుతో కలిసి ‘సమ్మోహనం’లో నటిస్తోంది. ‘ఘాజీ’తో విజయాన్ని అందుకొన్న సంకల్ప్‌, ఈసారి అంతరిక్షం నేపథ్యంలో సాగే కథని సిద్ధం చేశారు. ఆ కథ నచ్చడంతో వరుణ్‌ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అహం బ్రహ్మాస్మి అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో వున్నట్లు వినిపిస్తుంది.