కట్టప్పకు మరో గౌరవం


నటుడు సత్యరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ‘కట్టప్ప’ మైనపు విగ్రహాన్ని ఉంచబోతున్నారు. బాహుబలిలో ‘కట్టప్ప’ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు సత్యరాజ్. ఇప్పుడు ఆ పాత్ర విగ్రహం లండన్‌లోని ప్రతిష్ఠాత్మక మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో నెలకొల్పనున్నారు.

కాగా ‘బాహుబలి’లో ‘అమరేంద్ర బాహుబలి’, ‘మహేంద్ర బాహుబలి’గా నటించి, మెప్పించిన ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని ఇప్పటికీ లండన్‌‌ మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ఉంచారు. ఇప్పుడు సత్యరాజ్‌ విగ్రహాన్ని కూడా త్వరలో ఉంచబోతున్నారు. ఈ విషయాన్ని సత్యరాజ్‌ కుమారుడు, నటుడు సిబిరాజ్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఘనతను సొంతం చేసుకుంటున్న తొలి తమిళ నటుడు తన తండ్రి సత్యరాజ్‌ కావడం చాలా గొప్పగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారుసిబిరాజ్‌ .