మహేష్ బాటలో బాలీవుడ్ హీరో..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.. తాజాగా మల్టి ప్లెక్స్ నిర్మాణంలో కూడా చేరాడు. హైదరాబాద్ లో ఎంబి సినిమాస్ పేరిట భారీ మల్టి ప్లెక్స్ ఏర్పటు చేసి వార్తల్లో నిలిచాడు. ఈ థియేటర్ లో ఓ సారి సినిమా చూస్తే..మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్లాలనిపించే విధంగా ఏర్పటు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పటికి సినీ , రాజకీయ , బిజినెస్ రంగాల వారు ఈ థియేటర్ అనుభూతిని పంచుకున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సైతం మహేష్ బాబు బాటలో వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అజయ్ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు. నార్త్ ఇండియాలో రూ.600 కోట్లతో 250 స్క్రీన్స్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు అజయ్ దేవగణ్. పెట్టిన డబ్బులను తిరిగి వెనక్కి తీసుకొచ్చే విధంగా బిజినెస్ ను ప్లాన్ చేస్తున్నట్లు బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మహేష్ ను ఫాలో అయ్యే వారి సంఖ్యా రోజు రోజుకు పెరుగుతుంది.