‘RRR’లో అజయ్ దేవగణ్ !


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు, సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తాజా సమాచారమ్. ఆయన పాత్ర చాలా చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉంటుందట.

కొద్దిరోజుల క్రితం #RRR మల్టీస్టారర్ లో తమిళ నటుడు,దర్శకుడు సముద్రఖని నటించబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని తీసుకొన్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇదే తరహా ఒకట్రెండు రోజుల్లో అజయ్ దేవగణ్ అతిథి పాత్రపై రాజమౌళి క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ జతకట్టనుంది. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ ని ట్రై చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.